ఇటీవల కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. కాన్పెప్ట్ బాగుంటే హీరో ఇమేజ్ తో పనిలేదు. దానికి తోడు ఓటీటీల పుణ్యమా అని చిన్న సినిమాలు సైతం సినీ అభిమానులకు చేరువ అవుతోంది. అయితే.. కరోనాతో థియేటర్స్ లో సందడి తగ్గి.. ఓటీటీల్లోనే ఎక్కువ సినిమాలు విడుదల అవుతున్నాయి. సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ అయిన రామ్ అసుర్ మూవీ పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి మంచిగా ప్రేక్షక ఆదరణ పొందుతుంది.
అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్, చాందినీ, షానీ సాల్మన్ ప్రధాన పాత్రల్లో నటించిన రామ్ అసుర్ సినిమా ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పెద్ద పండగను పరుస్కరించుకుని రిలీజ్ అయిన సినిమాలన్నీ పక్కకు పోగా, ‘పుష్ప’తో పోటీపడుతూ ఏకంగా సెకండ్ ప్లేస్ వచ్చేసింది “రామ్ అసుర్”. తెలుగు మూవీస్ క్యాటగిరీలోనూ, యాక్షన్ అడ్వెంచర్ క్యాటగిరీలోనూ రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో “పుష్ప” ఉండటం విశేషం.
కృత్రిమ వజ్రం తయారు చేయడం అనే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘రామ్ అసుర్’ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఆర్టిఫీషియల్ డైమండ్ ను రూపొందించాలనుకున్న ఇద్దరి సైంటిస్టుల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ సినిమా కథాంశం. పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అభినవ్ సర్దాల్, చాందినీల లవ్ ట్రాక్ సినిమాకే హైలైట్ గా నిలవగా, బీమ్స్ అందించిన పాటలు మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. వెంకటేశ్ త్రిపర్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అభినవ్ సర్దార్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ‘రామ్ అసుర్’ ట్రెండింగ్ లోకి రావడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.