మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ మరోసారి కలిసి నటించబోతున్నారు.వీరిద్దరు ఇంతకుముందు మగధీర సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమాలో చిరు ఓ గెస్ట్ పాత్రలో నటించి అదుర్స్ అనిపించాడు. చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ఖైదీనంబర్: 150’ లోను వీరిద్దరు తిరిగి మరోసారి కలిసి నటించారు. ఈ సినిమాలోని ఓ పాటలో రామ్ చరణ్ తన స్టెప్పులతో అలరించారు. తాజాగా చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముచ్చటగా మూడోసారి చెర్రీ , మెగాస్టార్ కలిసి నటించనున్నారు. అయితే ఈ మూవీలో చరణ్ ఓ ప్రాధాన్యత కల్గిన రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష నటించనున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ముచ్చటగా మూడోసారి చిరంజీవితో కలిసి చరణ్