టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గురువారం రక్షితారెడ్డితో శర్వా నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యతో కలిసి హాజరయ్యారు. కాబోయే వధూవరులతో కలిసి రామ్ చరణ్ దంపతులు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాల్లోకి రాకముందు నుంచి రామ్‌చరణ్, శర్వానంద్ మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహ బంధాన్ని దృష్టిలో పెట్టుకొని శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు రామ్‌చరణ్ ఉపాసన దంపతులు హాజరయ్యారు. కాగా శర్వానంద్‌కు కాబోయే భార్య రక్షితారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
హైకోర్ట్ లాయర్ మధుసూదన్ రెడ్డి కూతురని సమాచారం. ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డికి రక్షితారెడ్డి మనవరాలు అవుతుందని
చెబుతున్నారు.శర్వానంద్ కి రక్షితా రెడ్డికి ఎప్పటి నుంచో స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. అతి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుందని సమాచారం.
ఇటీవలే ఒకే ఒక జీవితం సినిమా ద్వారా ఓ కమర్షియల్ హిట్ ను అదుకున్నాడు శర్వానంద్. ప్రస్తుతం దర్శకుడు కృష్ణ చైతన్యతో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీరామ్ ఆదిత్య శర్వానంద్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.