జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. కాగా దక్షిణ భారత దేశం తరపున ప్యాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు.
వివిధ రంగాల నుంచి 60 మంది పాల్గొంటున్న ఈ సమావేశంలో అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు ఫిల్మ్ టూరిజం,ఎకోఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో వేదికపై జరిగిన ఓ కార్యక్రమంలో.. చరణ్ తన నాటు నాటు స్టెప్పులతో అలరించారు.
ఆర్ఆర్ఆర్ మూవీలోని ఈ చిత్రానికి ఈ ఏడాది ఉత్తమ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. నాటు నాటు ట్యూన్స్ కు స్టేజ్‌పై ఉన్న అతిథులు కూడా రాంచరణ్‌తో కలిసి చిందేశారు.
కశ్మీర్ ఓ సుందరమైన ప్రదేశమని ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్ తెలిపారు. 1986 నుంచి తన తండ్రితో కలిసి ఇక్ోడకు వస్తున్నట్లు చెప్పారు.గుల్మార్గ్, సోనమార్గ్‌లో షూటింగ్‌లకు వెళ్లేవాడినన్నారు.
2016లో ఇదే ఆడిటోరియంలో ఓ షూటింగ్లో పాల్గొన్నట్లు వెల్లడించారు. ఇదో మ్యూజిక్ ప్రదేశమని, కశ్మీర్‌కు రావడం ఓ అద్భమైన ఫీలింగ్‌ను ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కశ్మీర్ అందాలకు ముగ్ధులు కాకుండా ఉండలేరని అభిప్రాయపడ్డారు.
ఈ రోజు మధ్యాహ్నం శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. రామ్ చరణ్ కు కశ్మీరీ తలపాగా చుట్టారు.అయితే జీ-20 సదస్సు వేదిక వద్ద కూడా రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు.