మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాది సంక్రాంతి పండుగను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్లో జరుపుకున్నారు. ఇక మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పండగలకు,పెళ్లిళ్లకు దూరం అనే సంగతి తెలిసిందే. అయితే ఈసారి సంక్రాంతి పండుగను మెగా కుటుంబం అక్కినేని ఫ్యామిలీతో కలిసి జరుగుతుంది.
కాగా కుటుంబం తో సంక్రాంతి పండుగను చేసుకున్న రామ్ చరణ్ కొంత సమయం తీసుకుని బాబాయ్ ఇంటికి వెళ్ళాడట. అక్కడ పవన్ కు పండగ శుభాకాంక్షలు తెలిపి కాసేపు ముచ్చటించాడట. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.