ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ తో పాటు మెగాస్టార్ ఆచార్య మూవీలో నటిస్తున్న రాంచరణ్… తన తర్వాతి సినిమాలపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గత కొంతకాలంగా కొత్త స్క్రిప్ట్స్ వింటునప్పటికీ అన్నింటిని చరణ్ రిజక్ట్ చేశాడు. కానీ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి చెప్పిన కథకు మాత్రం ఇంప్రెస్ అయి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇక తమిళ్ లో మంచి దర్శకుడిగా పేరున్న లోకేష్ కనగరాజ్ చెప్పిన కథను కూడా చరణ్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా, గౌతమ్ తో సినిమాను ఎన్.వి ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి.
అయితే, ఈ రెండు సినిమాల్లో ఏ మూవీ ఫస్ట్ సెట్స్ పైకి వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉండగా… ఆర్.ఆర్.ఆర్, ఆచార్య మూవీ షూటింగ్స్ పూర్తైన తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది.