‘ఆర్ఆర్ఆర్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రికార్డులను కొల్లగొడుతోంది. ఇక ఈ సినిమాతో ఆర్ఆర్ఆర్ హీరోల క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోతోంది. ఇటీవల రామ్‌చరణ్‌ను ముంబైలో ఊపిరి ఆడనంతగా అభిమానులు ముంచెత్తారు. ఇక తాజాగా చెర్రీకి పంజాబ్ పోలీసులలో ఉన్న క్రేజ్ చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే. పంజాబ్ పోలీసులు చెర్రీతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీని ఆర్సీ 15 అనే టైటిల్‌తోనే పిలుస్తున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పంజాబ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో లొకేషన్ నుంచి చెర్రీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలలో పంజాబీ పోలీసులు చెర్రీతో కలిసి ఫోజులిచ్చారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్‌చరణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో తెలుస్తోంది. అంతేకాదు, ఇటీవలే అమృత్‌సర్‌లో కూడా చెర్రీతో సెల్ఫీలు తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు.
కాగా. ఆర్సీ15 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో నటుడిని రెండు విభిన్న పాత్రల్లో చూపించనున్నారని తెలుస్తోంది. కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇక, ఈ చిత్రానికి తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.