నగేష్ కుకునూరు దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం గుడ్ లక్ సఖి. జనవరి 28న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. మొదట మెగాస్టార్ చిరంజీవిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
కానీ చిరంజీవికి పాజిటివ్ రావడంతో ఆయన స్థానంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ రామ్ చరణ్ తో నాటు నాటు పాటకు డాన్స్ వేయాలని ఉందని అన్నారు. వెంటనే రామ్ చరణ్ కూడా ఓకే చెప్పారు.
ఎవరితో అయినా అద్భుతంగా నటించగల, నాకెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకుంటున్నా అంటూ చెప్తూనే మీకు ఆ స్టెప్ వచ్చా… ఓసారి అయితే లైట్‌గా వేసి చూపించండి అన్నాడు. ఆమె వేసిన తర్వాత సరదాగా కీర్తితో కలిసి నాటు నాటు స్టెప్పు వేశారు చరణ్.
ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.ఇక జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంను ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.