పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పుష్పరాజుగా ఊర మాస్ పాత్రలో పుష్పా సినిమాలో చూపించాడు డైరెక్టర్ సుకుమార్.
ఇక అల్లు అర్జున్ నట విశ్వరూపం ఈ సినిమాలో ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కడం జరిగింది. కాగా ఈ సినిమాలో బన్నీ చాలా డిఫరెంట్గా కనిపించడం
ఆయన అభిమానులని ఎంతో సంతోషపరిచింది.ఆయన నటన ఆయన బాడీ లాంగ్వేజ్ కు ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు అని చెప్పాలి. ఇక సుకుమార్ మేకింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ పుష్ప సినిమాను పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది అని చెప్పాలి.
అయితే అన్ని భాషల్లో విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా దాంతోపాటు భారీ వసూళ్లను కూడా రాబట్టడం జరిగింది. ఇప్పుడు పుష్ప 2 కోసం ఆయన ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు .అయితే ముందుగా పుష్ప ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నామని చెప్పిన సుకుమార్ సెకండ్ పార్ట్ తెరకెక్కించే పనిలో ఇప్పుడు బిజీగా ఉన్నాడు.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా కోసం సుకుమార్ ఒక అదిరిపోయే ట్విస్ట్ మరియు యాక్షన్ సీన్స్ తీస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ క్లైమాక్స్ లో ఓ స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఊహించిన విధంగా ఆ హీరో ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు. ఇక ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .
అయితే పుష్ప 2 క్లైమాక్స్ లో రామ్ చరణ్ కనిపిస్తాడని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే పుష్ప 2 సినిమాలో రామ్ చరణ్ కనిపిస్తాడని జరుగుతున్న ప్రచారం విన్న వారి అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు. అయితే గతంలో ఈ ఇద్దరు కలిసి ఎవడు సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఇక సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ నూతన ఖాతాలో వేసుకున్నాడు..!!