మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఆచార్య సినిమాకు సంబంధించిన తర్వాతి షెడ్యూల్ పుష్పా సెట్ లో జరగబోతోందని సమాచారం. పుష్ప షూటింగ్ మొన్నటి వరకు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగింది.
ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆచార్య బృందం కూడా అక్కడే స్టే చేయబోతోంది. కాగా ఈ షెడ్యూల్ లో రాంచరణ్ సోలో సన్నివేశాలను తెరకెక్కిస్తారట.