రాజమౌళి..ఓ మామూలు దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టి కమర్షియల్ కంచుకోటలు బద్దలు కొట్టే రేంజ్ కి వెళ్ళిపోయాడు. వంద కోట్ల మార్కుని దాటితే వండర్ గా ఫీలయ్యే తెలుగు సినిమాని పేన్ ఇండియాకి పరుగులు పెట్టించాడు.
బాహుబలి 1 &2 లతో తెరపై విజువల్ వండర్ని క్రియేట్ చేసాడు. కోట్లవర్షం కురిపించి ఇండియన్ సినిమా దశదిశలు మార్చేసాడు. RRR తో ప్రపంచ దిగ్దర్శకుల చిట్టాలోకి చేరిపోయాడు.
రామ్ చరణ్ –తారక్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రికార్డ్స్ కైవశం చేసుకుంది. భారీ బడ్జెట్ తో దూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఆ తర్వాత ఓటీటీలో కూడా అదే జోరు కొనసాగించింది. పలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డులని గెలుచుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అమెరికాలో ఇప్పటి వరకూ స్పెషల్ స్క్రీనింగ్స్ కూడా వేసారు.
తాజాగా లాస్ ఏంజెలిస్ లో ఉన్న టీఎల్ సీ చైనీస్ థియేటర్ లోని ప్రపంచంలోను అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శన జనవరి 9న జరగనుంది. కాగా ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో దర్శక ధీరుడు రాజమౌళి,రామ్ చరణ్, ఎన్టీఆర తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి కూడా పాల్గోనున్నారు.
అనంతరం ప్రేక్షకులతో ఇంటరాక్టు అవుతారు. కాగా, ఇప్పటివకూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్.. ఉత్తమ సినీగీతం కేటగిరీలో చిత్రంలోని “నాటు నాటు” పాట ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోకి చేరుకుంది.