సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ క్రేజీ ప్రాజెక్ట్ ఆచార్య. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఓ రోల్‌లో కనిపిస్తారని ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా..తాజాగా రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌తో ఓ పోస్టర్‌ను కొరటాల శివ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
మెడలో రుద్రాక్ష.. చెవికి పోగు పెట్టుకొని పోస్టర్ కనిపిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో సిద్ధ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు తెలుస్తుండగా.. మా ‘ సిద్ధ ‘ సర్వం సిద్ధం అని కామెంట్ చేస్తూ ఆచార్య సెట్‌లోకి స్వాగతం పలుకుతున్నట్టు కొరటాల ట్వీట్ చేశాడు. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తోంది.
మా ' సిద్ధ ' సర్వం సిద్ధం.
Welcoming our #ramcharan garu onto the sets of #Acharya. @AlwaysRamCharan @KChiruTweets #manisharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan @KonidelaPro @MatineeEnt pic.twitter.com/hJaaYDqF1K— koratala siva (@sivakoratala) January 17, 2021