మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. దీని తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు చరణ్. ఇదిలా ఉండగా రామ్ చరణ్ త్వరలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతున్నారట. ఇదే విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఓ న్యూస్ ఛానల్ ని రామ్ చరణ్ తీసుకోబోతున్నారట.
నష్టాల్లో ఉన్న న్యూస్ ఛానల్ కు లాభదాయకమైన రేటును ఫిక్స్ చేసి కొంటున్నారట రామ్ చరణ్. ఇక ఎప్పటి నుంచో జనసేనకి మద్దతుగా ఛానల్ లేకపోవడంతో జనసైనికులు ఇదే విషయంపై రామ్ చరణ్ ను పలుమార్లు అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ మీడియా రంగంలోకి అడుగు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.