మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.సరికొత్త లుక్ లో రామ్ చరణ్ ఇందులో కనిపించారు. ఈ లుక్ శంకర్‌తో చేస్తున్న ఆర్సీ 15 కోసమని అర్ధం అవుతుంది.
తెల్లటి టీ-షర్ట్, నలుపు ప్యాంటుతో చరణ్ కనిపిస్తున్నాడు. హెయిర్ స్టైల్ కూడా పూర్తిగా మార్చాడు. RC15లో ద్విపాత్రాభినయం కోసం చరణ్ తన జుట్టును పెంచుతున్నట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, రెహమాన్, శ్రీకాంత్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
థమన్ సంగీతం అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.