అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ వంగ. ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షించి, యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత అదే కథతో హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టాడు సందీప్. ఆ తరువాత ఇప్పటివరకు తన తరువాత సినిమాను ఎనౌన్స్ చెయ్యలేదు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితం అయిన సందీప్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం ఓ కథ రాస్తున్నడట.
చరణ్ కు ఇప్పటికే సందీప్ స్టోరీ లైన్ కూడా వినిపించినట్టు సమాచారం. ఆ లైన్ చరణ్ కు బాగా నచ్చటంతో కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడట సందీప్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేయబోయే సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ పేర్లు మొదట వినిపించినప్పటికీ తాజాగా సందీప్ పేరు తెర మీదకు వచ్చింది. మరి చరణ్ ఎవరితో తరువాత సినిమా చేస్తాడు అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే.