మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పటి వరకూ ప్రకటించలేదు. లాక్ డౌన్ సమయంలో ఇద్దరు ముగ్గురు దర్శకులు చరణ్ కు కథ వినిపించిన ఫైనల్ చేయలేదు.
తాజాగా తాను చేయబోయే తర్వాత చిత్రం గురించి అధికారికంగా ప్రకటన చేశాడు. సంచలన దర్శకుడు శంకర్ తో తన తర్వాత సినిమా చేయబోతున్నట్లు చరణ్ ప్రకటించాడు. జెంటిల్ మెన్, ప్రేమికుడు, అపరిచితుడు, ఒకే ఒక్కడు, జీన్స్, రోబో వంటి చిత్రాలతో శంకర్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించనున్నారు.
Excited to be a part of Shankar Sir's cinematic brilliance produced by Raju garu and Shirish garu.
Looking forward to #RC15 ! @shankarshanmugh @SVC_official #SVC50 pic.twitter.com/SpjOkqyAD4
— Ram Charan (@AlwaysRamCharan) February 12, 2021