కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. రాజమండ్రిలో మొదటి షెడ్యూల్ చిత్రీకరణ స్టార్ట్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ జరిపే ప్రదేశాల్లో సెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమాలో చిరంజీవి ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో ఇంకా ఎవరెవరు నటిస్తారు అనే అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా చిరంజీవి చేస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యే వరకు మరో సినిమా షూటింగ్ లో పాల్గొనవద్దనే కండిషన్ రాజమౌళి పెట్టడంతో ..ఆయన చిరు సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో కొరటాల శివ రామ్ చరణ్ స్థానంలో మరో మెగా హీరోను తీసుకోవాలని భావించారు. వెంటనే అల్లు అర్జున్ సంప్రదించారు కొరటాల శివ. చిరంజీవి సినిమాలో చేసే అవకాశం రావడంతో బన్నీ కూడా అందుకు ఒకే చెప్పినట్లు ఫిలిం వర్గాల సమాచారం. ఈ చిత్రంలో బన్నీ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.