ఉప్పెన సినిమా తో హీరోగా పరిచయం అవుతున్న మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఇదిలావుండగా మరోవైపు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజాగా సంక్రాంతి సందర్భంగా టీజర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ టీజర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. టీజర్ చాలా అందంగా ఉంది. వైష్ణవి తేజ్ కృతి జంట చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇక దర్శకుడు బుచ్చిబాబు కు, నిర్మాణ సంస్థ మైత్రికి ఇతర టెక్నీషియన్స్ కు శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
This teaser is so beautiful !!
My brother #PanjaVaisshnavTej and @IamKrithiShetty make a really fresh pair👍Wishing the best to @BuchiBabuSana, @MythriOfficial & the entire team of #Uppena.
All the best! https://t.co/OH235Lnust
— Ram Charan (@AlwaysRamCharan) January 15, 2021