మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ శుక్రవారం తన తల్లి కొణిదెల సురేఖకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మీకు తెలిసినట్టుగా నేనెవరికీ తెలియదు!! హ్యాపీ బర్త్ డే మా అంటూ విషెస్ తెలిపారు.
అలాగే ఆచార్య సెట్స్ లో తీసుకున్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఇందులో సురేఖకు ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి, మరోక వైపు రామ్ చరణ్ ఉన్నారు. అయితే ఇందులో ఉపాసన మాత్రం కనిపించలేదు.
ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడింది.
ఇప్పుడు ఎట్టకేలకు ఏప్రిల్ 29న విడుదల కానుంది. వాస్తవానికి ఏప్రిల్ 1 న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. కానీ మార్చి 25న ఆర్ ఆర్ ఆర్ ఉండటంతో వెనక్కి తగ్గారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.