కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. కాగా మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. మరోవైపు రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటించబోతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. అయితే ఆచార్య లో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం పై చరణ్ తాజాగా స్పందించారు.
తనది అతిథి పాత్ర కాదని తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒకే తెరపై కనిపించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాన్న సినిమాలో నాన్న తో కలిసి నటించే అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.