మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా రాబోతున్న సంగతితెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. హైదరాబాదులో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రణవీర్ సింగ్, రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, హీరో శ్రీకాంత్, కియారా అద్వానీ, అంజలి, సునీల్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.
దిల్ రాజు బ్యానర్ లోఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 50వ సినిమా. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.