కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంట్లో ఒంటి పని ఇంటి పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధృవ సినిమా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. షూటింగ్ టైం ని మిస్ అవుతున్న అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటున్నారు.
తిరిగి షూటింగ్ లో పాల్గొనటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నానంటూ… ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ”ధృవ సినిమా సెట్స్ లోని త్రో బ్యాక్ పిక్స్ ఇవి. సెట్స్ కి తిరిగి వెళ్ళడానికి ఇక వేచి ఉండలేను. అయితే అప్పటి వరకు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి” అంటూ చరణ్ పోస్ట్ చేశాడు.