మలయాళంలో హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ హక్కుల్ని రామ్‌చరణ్ దక్కించుకున్నాడని పృధ్విరాజ్ స్వయంగా చెప్పాడు. సో, ఈ మూవీ తెలుగులో ఎవరు చేస్తున్నారు? తన బాబాయ్ పవన్‌కల్యాణ్ చేస్తాడా? లేక చిరంజీవి చేస్తాడా? అందులో చిన్నపాత్రలో కనిపించే పృధ్విరాజ్ రోల్ ఎవరు చేస్తారు? చెర్రీ చేస్తాడా?
తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు చేయడమే ఓ సాహసం. కృష్ణ-శోభన్‌బాబు కాలంలోనే ఆ అభిప్రాయం ఫిక్సయిపోయింది. ఈమధ్య వేరే వాళ్ల సినిమాల్లో వేరే హీరోలు తళుక్కున మెరవడం మినహా పూర్తిస్థాయి మల్టీస్టారర్ సినిమాలు రాలేదు. కాకపోతే, రెండు జనరేషన్ల హీరోలు చేయడం మాత్రం కలిసి నటించడం సాధ్యం అవుతోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..నుంచి కమింగ్ సూన్ మూవీ వెంకీమామ వరకు. కానీ, సేమ్ స్ట్రంగ్త్ వున్న హీరోలు కలిసి చేయడం మాత్రం కల్లగానే వుండిపోయింది.
ఇలావుంటే, తండ్రీకొడుకులు కలిసి చేయడం ఆమధ్య అక్కినేని కుటుంబ కథాచిత్రం ‘మనం’లో చూశాం. తర్వాత మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీ కత్తిలో రామ్‌చరణ్ ఓ సాంగ్‌లో ఇలా కనిపించి అలా మాయమవ్వడం చూశాం. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే.. ఆ వార్తే దసరా పండగ మెగాఫ్యాన్స్‌కి.
యస్.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇద్దరూ కలిసి వెండితెరను పంచుకుంటూ మెగాభిమానులకు ఖుషీ చేయాలని డిసైడయ్యారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రం ‘లూసిఫర్’ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. మలయాళంలో ఈ మూవీ చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి, అందులో ఓ కీలక పాత్ర చేశాడు. ఇప్పుడు ఈ మూవీ రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ తెలియజేశారు.
చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ సినిమా తర్వాతే లూసిఫర్ రీమేక్ వుంటుంది. మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తారు. ఇప్పటి వరకు మగధీర, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో చిరు, చెర్రీ తళుక్కున కనిపించారు. రీమేక్ పట్టాలకెక్కితే అదో వండర్ అవుతుంది.
ఇలావుంటే, చెర్రి అండ్ చిరు రీమేక్ మూవీ లూసిఫర్‌ని బోయపాటి శీను డైరెక్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.