ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సైరా నరసింహారెడ్డి చిత్రం కోర్టు చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ సెన్సార్ అయింది కానీ, సర్టిఫికెట్ ఇంకా మంజూరు చేయలేదని సెన్సార్ బోర్డు కోర్టుకు తెలిపింది. ఈ కేసుని వచ్చే సోమవారం వరకు వాయిదా వేసింది హైకోర్టు. ఇదే సమయంలో రామ్ చరణ్ తన కొణిదల ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా సెన్సార్ బోర్డు మంజూరు చేసిన సర్టిఫికెట్ విడుదల చేశారు. సర్టిఫికెట్ ఇంకా మంజూరు చేయలేదని కోర్టుకు తెలిపిన తర్వాత సర్టిఫికెట్ రామ్ చరణ్ చేతికి ఎలా వచ్చింది? రామ్ చరణ్ అండ్ కో న్యాయ వ్యవస్థను మోసం చేశారా? మరి ఇలాంటి సమయంలో నరసింహారెడ్డి కుటుంబీకులు తమకు న్యాయం జరగాలంటూ వేసిన కేసు ఏ మలుపు తిరగబోతోంది.? ఈ ప్రశ్నలన్నీ ప్రస్తుతం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.