నటనకు ఆస్కారం ఉన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాంచరణ్. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ తో పాటు ఆచార్య సినిమాల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మెగా పవర్ స్టార్… ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
తెలుగులో మార్కెట్ పై పట్టు కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్న మా టీవీ అనుబంధ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ ఇప్పుడు తన బ్రాండ్ అంబాసిడర్ గా రాంచరణ్ తో జట్టుకట్టినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండనున్నారు.