మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన హీరో రాంచరణ్. కెరీర్ ఆరంభంలోనే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో రికార్డు బ్రేక్ హిట్ అందుకున్నాడు చెర్రి. ఇప్పుడు మళ్ళీ ఈ జోడి RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ ఈ సినిమాలో అల్లూరిసీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.
అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి ఆఖరుకు షూటింగ్ ను ముగించనుందని సమాచారం. దీంతో చెర్రి తన నెక్స్ట్ సినిమా పై ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది వినయ విధేయ రామ సినిమాతో వచ్చిన చెర్రి… బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ రావటంతో అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇప్పటికే కథలు వింటున్న చెర్రి జనవరి లో ఏదో ఒక కథను ఫైనల్ చెయ్యాలని ఆలోచనలో ఉన్నాడట. మరో వైపు కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా రాంచరణ్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది.