మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రోజురోజుకి తన పాపులారిటీని పెంచుకుంటూ పోతున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నాడు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించిన రామ్ చరణ్.. తన విలక్షణమైన నటనతో హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ డైరెక్టర్స్ ని కూడా ఫిదా చేశాడు.
ఈ క్రమంలోనే ఇటీవల వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ కూడా రామ్ చరణ్ పాత్రలోని లేయర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అంతేకాదు తాజాగా ప్రఖ్యాతి హాలీవుడ్ అవార్డ్స్ HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) కి రామ్ చరణ్ ని ప్రజెంటర్ గా ఆహ్వానించారు. ఈ ఈవెంట్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు.
ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరోగా చరణ్ రికార్డ్ సృష్టించాడు. ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో ఈ అవార్డుల వేడుక జరగబోతుంది. ఇందుకోసం రామ్ చరణ్ ఇటీవలే అమెరికా చేరుకున్నాడు. ప్రస్తుతం అక్కడే ఉన్న చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన షో.. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’. ఈ టాక్ షోకు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లబోతున్నాడు.
ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 11.30 ISTకి ఈ షో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాలీవుడ్ మీడియా తెలియజేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్ అభిమానులు సందడి చేస్తున్నారు. కాగా మార్చి 13న ఆస్కార్ అవార్డులు వేడుక జరుగనుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకోవడంలో సందేహం లేదు అంటున్నాయి హాలీవుడ్ మీడియా. ఇప్పటికే ఈ పాట పలు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడమే కాకుండా, ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని కూడా అందుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.