యాక్షన్ హీరో అర్జున్- సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా హిట్టయింతో తెలుసుకదా. ఒక్కరోజు ముఖ్యమంత్రి థీమ్‌తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. అటు అర్జున్‌ను, ఇటు శంకర్‌ను కెరీర్‌లో మరో మెట్టు ఎక్కించింది. ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో వస్తుందంటే ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అయితే శంకర మరోసారి అలాంటి మేజక్‌ను తన అప్‌కమింగ్ మూవీలో రిపీట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో శంకర్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్టుకు ప్లాన్ చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చరణ్ ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీపొడక్షన్ పనులు చాలా స్పీడ్‌గా జరిగిపోతున్నాయి కూడా. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సమాజంలోని సమస్యలను ప్రశ్నించే కథలతో కూడిన సినిమాలు చేసే శంకర్.. చరణ్‌తో అలాంటి ప్రాజెక్టునే చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ రోల్‌లో కనిపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంత తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే.