మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటు ఆర్.ఆర్.ఆర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలోనూ కీ రోల్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఆచార్యలో తన పార్ట్ పూర్తిచేయనున్నారు చరణ్. ఇందుకోసం రాజమండ్రిలో షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు.
రాజమండ్రి పరిసర ప్రాంతంలో వేసిన ఓ భారీ సెట్ లో చరణ్ షూటింగ్ ఉండనుంది. డైరెక్టర్ కొరటాల శివ అంతకుముందే రాజమండ్రి చేరుకోగా… చరణ్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఆచార్యలో చరణ్ సిద్ధాగా కనపించనున్నారు. డైరెక్ట్ గా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవటం చరణ్ కు ఇదే తొలిసారి.