మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం ద్వారా నార్త్ లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు దిగ్గజ దర్శకుడు శంకర్ తీస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. అయితే.. ఏమాత్రం ఖాళీ సమయం చిక్కినా భార్య ఉపాసనతో హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లిపోతున్నాడు చెర్రీ.
మంగళవారం చరణ్ ఉపాసనల 10వ పెళ్లి రోజు. ప్రస్తుతం వీరిద్దరూ ఇటలీలో ఉన్నారు. అక్కడ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను ఉపాసన ట్వీట్ చేశారు. సోమవారం సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోపైనే చర్చ జరగ్గా.. చరణ్ జగదేకవీరుడులో మెగాస్టార్ ను గుర్తు చేశారని కామెంట్స్ వచ్చాయి.
ఇక పెళ్లిరోజున దిగిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయగా సెలెబ్రిటీలతో పాటు అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరూ చూడచక్కగా ఉన్నారంటూ కామెంట్లు పెట్టారు.
కాజల్ అగర్వాల్, సమంత.. చెర్రీ, ఉపాసనకు హ్యాపీ యానవర్సరీ చెప్పారు. ‘‘మీ జీవితంలో సంతోషం, చిరునవ్వులు ఎప్పటికీ ఉండాలి అంటూ కాజల్ కామెంట్ పెట్టగా.. నా ఫేవరట్ కపుల్ ఇద్దరికీ హ్యాపీ వెడ్డింగ్ యానవర్సరీ అంటూ సమంత కామెంట్ పెట్టింది. అలాగే సానియా మీర్జా కూడా శుభాకాంక్షలు తెలియజేసింది.