మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా కాలంగా సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. ఇదే విషయాన్ని చెబుతూ… 2 సంవత్సరాల తర్వాత వెకేషన్ ! థాంక్స్ చరణ్ అంటూ అని పోస్ట్ పెట్టింది.
ఈ ఇద్దరూ ప్రస్తుతం ఫిన్లాండ్ లో ఉన్నారు. అక్కడ ఉన్న సుందరమైన లొకేషన్ లో దిగిన ఫోటోను షేర్ చేశారు. అందుకు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత రామ్ చరణ్‌తో ఉపాసనల మొదటి వెకేషన్ ఇది.
ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ఆర్సీ 15 సినిమా చేస్తునాడు. ఇటీవలే ఈ సినిమా షెడ్యూల్ ను రాజమండ్రిలో పూర్తి చేసి వెకేషన్‌కు వెళ్లారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక దీని తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చరణ్. మరోవైపు చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25 న రిలీజ్ కాబోతుంది.