కొణిదెల కుటుంబంతో మమేకమైపోయారు ఉపాసన. ప్రతి వేడుకలో ఆమె కుటుంబంతో కలిసి పాల్గొని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటుంది. సోషల్ మీడియాలో వేడుకకు సంబంధించి ఫోటోలను షేర్ చేస్తుంటుంది ఉపాసన. చిరంజీవి , రామ్ చరణ్ లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ఉపాసనే అభిమానులకు తెలియజేస్తుంది. అటు మెగా ఫ్యామిలీకి, ఇటు వారి అభిమానులకు మధ్య ఆమె వారధిలా ఉంటూ అప్డేట్స్ ఇస్తుంటుంది.
సంక్రాంతిను పురస్కరించుకొని మెగా ఫ్యామిలీ అంత ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ హాజరయ్యారు. సంక్రాంతిని మెగా కుటుంబం ఎంతో ఆనందంగా జరుపుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి,ఆయన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది ఉపాసన. అంతేకాదు తన మామ, అత్తపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తనకు ప్రతి విషయంలో తన అత్త సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొంది.