ఈ మధ్య సినిమాల్లో స్టార్ హీరోల భార్యలకు, స్టార్ హీరోయిన్లకు మధ్య సహృద్భావం కొనసాగుతున్న నేపథ్యాలు చాలా అరుదు. అలాంటి వాళ్ళలో రామ్ చరణ్ భార్య ఉపాసన, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా స్నేహం చెప్పుకోతగినది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ ఈవెంట్‌కు అటెండ్ అయ్యేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తెలుగోడి సత్తాను చాటుతున్న ఆయన.. రీసెంట్‌గా ప్రీ-ఆస్కార్ ఈవెంట్ సౌత్ ఏషియన్ ఎక్సలెన్స్ కు అటెండ్ అయ్యారు.
హీరోయిన్ ప్రియాంక చోప్రా, వైఫ్ ఉపాసనతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన ఉపాసన.. లాస్ ఏంజిల్స్ ఫ్యామిలీ అని ట్యాగ్ చేసింది.తమ కోసం ఎప్పుడూ ఉన్నాననే ధీమానిచ్చిన పీసీకి కృతజ్ఞతలు తెలిపింది.