ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. చరణ్ కెరీర్లోనే డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో ఆరెంజ్ ఒకటి. 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది.
కానీ ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు తన సొంత బ్యానర్ పై నిర్మించారు..
జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రభు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రేమ.. కొన్నాళ్లు మాత్రమే బాగుంటుందని.. లవ్ స్టోరీని డిఫరెంట్ గా చెప్పడానికి ట్రై చేశారు డైరెక్టర్ భాస్కర్.
కానీ అప్పట్లో ఈ చిత్రం యూత్ కు కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమా అంతగా క్లిక్ కాలేకపోయింది. అంతేకాకుండా ఈ సినిమాతో నాగబాబు తీవ్ర నష్టాలపాలు అయ్యారు. ఇక ఇదే సినిమాను ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ చేశారు నాగబాబు.
మూడు రోజులపాటు స్క్రీనింగ్ అయ్యే సినిమాకు వచ్చే డబ్బులు జనసేన పార్టీకి ఇస్తానని అన్నారు నాగబాబు. అయితే ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ చిత్రం మాత్రం ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అప్పుడు బోసిపోయిన థియేటర్లు..ఇప్పుడు యూత్‌లో హౌస్ ఫుల్ అయ్యాయి. మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 3 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈవిషయాన్ని నాగబాబు అధికారికంగా ప్రకటిస్తూ.. రీరిలీజ్ సినిమా హిట్ కావడం విశేషం అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు..