బాలీవుడ్ కొత్త జంట కియారా అడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రకు టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన సారీ చెప్పారు. అందేంటి అని అనుకుంటున్నారా.. మంగళవారం కియారా-సిద్ధార్థ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో సూర్యగ్రహ్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం వైభవంగా జరిగింది.
కాగా పెళ్లికి సంబంధించిన ఫొటోలను కియారా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉపాసన సైతం కియారా-సిద్ధార్థ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వివాహ వేడుకకు ఉపాసన రాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ఆర్‌సీ 15గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.