వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. నిత్యం ఏదో ఒక ఇష్యూ తో కాంట్రవర్షల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా వర్మ ఇంకో వివాదం తో బయటకు రానున్నాడు. తన నెక్స్ట్ సినిమా కమ్మ రాజ్యం లో కడప రెడ్లు ట్రైలర్ ని రిలీజ్ చెయ్యటానికి ముహూర్తం ఫిక్స్ చేశాడు. దీపావళి కానుకగా 27 వ తేదీ ఉదయం 9.36 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్ వర్మ రాసుకొచ్చాడు. తన సినిమాలతో మాటలతో ఎప్పుడు వివాదాలు తెచ్చుకునే వర్మ ఈ సారి ఏమి చేస్తాడో అని అందరు ఎదురు చూస్తున్నారు.