సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. వర్మ మాట్లాడు అంటే ఇక్కడ కచ్చితంగా కాంట్రవర్సీ ఉంటుంది. గతంలో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వర్మ ఇటీవల కాలంలో ఆ స్థాయిలో సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జునతో వర్మ చేసిన శివ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.
త్వరలో హీరో రామ్ పెళ్లి ! అమ్మాయి ఎవరో తెలుసా ?
అయితే రాంగోపాల్ వర్మ చిరంజీవి కాంబినేషన్లో సినిమా రావాలని అప్పట్లో మెగా అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మంచి హిట్ అవుతుందని భావించారు. కానీ అది కుదరలేదు. నిజానికి ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ అప్పట్లో ఇద్దరితో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ సమయంలో హిట్లర్ సినిమాలో నటిస్తానని మెగాస్టార్ చిరంజీవి నిర్మాత మోహన్ కి డేట్స్ ఇచ్చారు.
నాగార్జున, మహేష్ బాబు ఇండస్ట్రీలోకి రావటానికి ఎన్టీఆర్ కారణమట! ఎలానో తెలుసా ?
మరోవైపు రాంగోపాల్ వర్మ కూడా చెప్పిన సబ్జెక్టు నచ్చడం వల్ల అశ్విని దత్ కి కూడా డేట్స్ ఇచ్చారు చిరంజీవి. ఒక నెలలో 15 రోజులు హిట్లర్ కి మరో 15 రోజులు వర్మ సినిమాకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. కానీ అదే సమయంలో సంజయ్ దత్ ఊర్మిళా జంటగా హిందీలో దౌడ్ చిత్రం తెరకెక్కిస్తున్నారు వర్మ. ఈ చిత్రానికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ స్టార్ట్ చేసే సమయంలో సంజయ్ దత్ జైలుకు వెళ్లారు. అప్పుడు ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. దీంతో చిరంజీవి చిత్రం చేయటానికి రెడీ అయ్యాడు వర్మ.
1996 కర్ణాటకలో ఈ చిత్రం షూటింగ్ స్టార్టింగ్ చేశారు. చిరంజీవి ఊర్మిళపై ఒక పాట కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. తొలి షెడ్యూల్ పూర్తయింది. ఇంతలో సంజయ్ దత్ కు బెయిల్ వచ్చి విడుదలయ్యారు. దీంతో దౌడ్ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత చిరంజీవితో షూటింగ్ చేద్దామని అనుకున్నాడు వర్మ. అందుకు చిరు కూడా ఓకే చెప్పాడు. కానీ రెండు మూడు నెలలు వెయిట్ చేసినా దౌడ్ సినిమా పూర్తి కాకపోవడంతో చిరంజీవి కాస్త అసంతృప్తితో వేరే సినిమాలకు ఓకే చెప్పేసాడు. ఆ విధంగా చిరంజీవి వర్మ ల సినిమా ఆగిపోయింది.