చీప్ కామెంట్స్‌తో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారే సెలెబ్రిటీ రామ్‌గోపాల్‌వర్మ…! శివ మూవీ సెన్షేషన్‌తో ఒక్కసారిగా బిగ్ డైరెక్టర్ పోస్ట్ దక్కింది. టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో వెరైటీ మూవీలు తీస్తూ వర్మఆలిండియాలో మాంచి క్రేజ్ సంపాదించాడు. అదంతా గతం. ఇటీవల మూవీల కంటే ట్వీట్ల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిన వర్మ ఎప్పుడు ఎవరి మీద ఎలా రియాక్టవుతాడో అసలే తెలియదు. ట్వీట్ పెట్టాడంటే ఎవరిమీదో మూడిందన్న మాటే. ఈమధ్య వర్మ కామెంట్స్ అన్నీచీప్ ఫార్మాట్‌లో వస్తున్నాయి. ఇప్పుడు చేసిన టీచర్స్ డే కామెంట్ అలాంటిదే. టీచర్స్ డేని టీచర్స్ డే విస్కీతో టీచర్లు సెలబ్రేట్ చేసుకుంటారా..? అని ప్రశ్నించడంలోనే అతని వెటకారం ఉంది. నా టీచర్లు వెరీ బాడ్..! నన్ను మంచి విద్యార్థిగా తీర్చిదిద్దలేదు..! మంచి వ్యక్తిత్వమున్న వ్యక్తిగా మార్చడంలో నా టీచర్లు ఫెయిల్…! ఇది రామ్‌గోపాల్‌వర్మ టీచర్స్ డే కామెంట్..!
వర్మ బ్యాడ్ స్టూడెంట్..అయితే టీచర్స్ గుడ్ స్టూడెంట్‌గా ఎందుకు చేయలేదు..? మార్చడం వారి విధి కాదా..? ఇవీ వర్మ బ్యాడ్ క్వశ్చన్.
ఇలాంటి మనిషిని టీచర్లు మాత్రం మార్చగలరా…? అసలు స్కూలుకు, కాలేజీకి సరిగ్గా వెళ్లని ఆకతాయిల్ని టీచర్లే కాదు…జన్మనిచ్చిన తల్లిదండ్రులే వదిలేస్తారు. వర్మలాంటివాళ్లని అయితే చివరికి ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు..!
Do Teachers celebrate TEACHER’S DAY by drinking TEACHER’S WHISKY? ..just asking! pic.twitter.com/n5C5qSejow
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2019