రాంగోపాల్ వర్మ… వివాదాలతో ఉన్న, కరోనా వంటి కామ్ టైమ్ లోనూ తన స్టైలే వేరు అని నిరూపిస్తున్నాడు. అయితే… దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో సినీ సెలబ్రిటీలంతా తమ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేయటం, వీలైతే కాస్త సహాయం చేయటం చేస్తున్నారు.
కానీ అందరిలా నేను చేస్తే ఏంటీ స్పెషల్ అనుకున్నాడో… మోడీ కరోనా దీపం పిలుపు నచ్చలేదో తెలియదు కానీ దేశంలో మెజారిటీ ప్రజలంతా ఇంట్లో లైట్స్ ఆర్పేసి దీపాలు వెలిగించారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ఆర్థిక-వ్యాపార మేధావులంతా పాల్గొన్నారు.
అందరిలా చేస్తే నేను ఆర్జీవీ ఎందుకైతా అనుకున్నాడో ఏమో… రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశాడు. లైటర్ తో సిగరెట్ వెలిగించుకునే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. అంతేకాదు… ఈ ఫోటోతో పాటు ఆర్జీవీ కామెంట్స్ చేశాడు. ఎవరూ దీన్ని పాటించొద్దు అని హెచ్చరిక చేస్తూనే… పొగ త్రాగరాదు అని ప్రభుత్వాలు చేసే హెచ్చరికల కన్నా కూడా కరోనా వైరస్ చాలా ప్రమాదం అంటూ ట్వీట్ చేశాడు.
9 PM Disclaimer : Not following Corona warnings is far more dangerous than not following government warnings on cigarette smoking pic.twitter.com/Few9fyXhOg
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2020
అంతేకాదు… అమెరికాలో 2లక్షల మంది కరోనాతో మృతి చెందుతారు అన్న వార్తలతో పాటు అగ్రరాజ్యం అనే ట్యాగ్ లైన్ ఉన్న అమెరికాను తనదైన శైలీలో విమర్శిస్తున్నాడు.