రాంగోపాల్ వర్మకు హిట్ వచ్చిన విషయం ప్రేక్షకులకు ఏమో గానీ… ఆయనకన్నా గుర్తుందో లేదో అంటూ ఆర్జీవీపై వచ్చే కామెంట్స్ అన్ని ఇన్నీ కావు. హిట్‌తో సంబంధం లేకుండా, కలెక్షన్లతో ప్రభావితం కాకుండా సినిమాలు తీసుకుంటూ పోవటమే ఆయన పని. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా చేస్తున్న రాంగోపాల్ వర్మ మరో కొత్త చిత్రానికి రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఈసారి తెలుగులో కాకుండా బాలీవుడ్‌లో సినిమా తీయనున్నారు ఆర్జీవీ. సినిమా పేరు కూడా ఫిక్స్ అయిపోయిందట. లెటెస్ట్ సినిమా పేరు టూరిస్ట్… ఎంటర్ ది లేడీ డ్రాగన్ అనేది ట్యాగ్ లైన్. అరవై కోట్ల భారీ బడ్జేట్‌తో ఇండో చైనా టూరిస్ట్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. బ్రూస్‌లీలాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ హిందీ హీరోయిన్ బ్రూస్ లీ లాంటి పాత్రలో నటించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
అయితే ఎవరా హీరోయిన్, టూరిస్ట్ సినిమా పూర్తి విశేషాలను వర్మ ట్విట్టర్ ద్వారా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.