రోజుకో ఫోటో ని విడుదల చేస్తూ రామ్ గోపాల్ వర్మ సంచలనం రేపుతున్నాడు. శుక్రవారం వర్మ రిలీజ్ చేసిన లుక్ లో పవన్ కళ్యాణ్ ఓ సభలో విదేశీయులతో డాన్స్ లు చేస్తున్నట్టు రిలీజ్ చేశాడు. తరువాత పవన్, లోకేష్ లు సంభాషించుకుంటున్న ఫోటో ని రిలీజ్ చేశాడు వర్మ. తాజాగా ఇంకో ఫోటో ని రిలీజ్ చేశాడు. సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలతో చంద్రబాబు, లోకేష్ నడుచుకుంటూ వస్తున్న ఫోటో తో పాటు చీకటిలో కూర్చున్న ఎన్టీఆర్ తనఫొటోని తాను చూస్తున్నట్టు కూడా వర్మ పోస్ట్ చేశాడు. వర్మ రిలీజ్ చేస్తున్న ఫొటోలకే నెట్టింట్లో రచ్చ జరుగుతుంది.ఇంకా వర్మ ఇంకో కాంట్రవర్షికి సిద్ధంగా ఉన్నాడు. దీపావళి కానుకగా కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నాడు. ఫొటోలతో బీబత్సహం సృష్టిస్తున్న వర్మ ఇంకా ట్రైలర్ తో ఎంత రచ్చ చేస్తాడో చూడాలి.