రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు. లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం రేపిన వర్మ ఈ సారి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేసాడు. ఆ పోస్టర్ లో చంద్రబాబు, జగన్ పవన్ లను చూపించిన వర్మ తాజాగా ట్విట్టర్ లో మరో పిక్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తి ఒక రాజకీయా సభ లో విదేశీ డాన్సర్ లుతో ఉన్న పిక్ పోస్ట్ చేశాడు. మరి పవన్ ఫాన్స్ దీనిపైనా ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.మొత్తానికి ఈ సారి వర్మ పవన్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది.