తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడచూసినా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయాలే హాట్ టాపిక్ గా మారాయి. రోజు రోజుకి సినిమాకి సంబందించిన స్టిల్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. నెట్టింట్లో ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పవన్, లోకేష్, చంద్రబాబు, జగన్ అందరిని చూపిస్తూ ట్రైలర్ కూడా వర్మ ఇప్పటికే రిలీజ్ చేశాడు.
పవన్ వేదేశీయులతో డాన్స్ చేస్తూ ఉన్న ఫోటోతో పాటు లోకేష్ తో ఏకాంతంగా మాట్లాడుతున్న స్టిల్స్ ని మొదట రిలీజ్ చేశాడు వర్మ. తరువాత చంద్రబాబు యోగ చేస్తున్న ఫోటో ని పోస్ట్ చేశాడు. ఇప్పుడు మరో ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. చంద్రబాబు, జగన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నట్లు ఉన్న ఒక ఫోటో హల చల్ చేస్తుంది.