చంద్రబాబును టార్గెట్ చేస్తూ… కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. చంద్రబాబుకు వయస్సు అయిపోతుంది, కొడుకు మీద ప్రేమతో పార్టీని సర్వనాశనం చేశాడు అంటూ ట్రైలర్‌లోనే తాను సినిమాలో ఏం చూపించబోతున్నాడో చెప్పకనే చెప్పేశారు.
చంపమీద కొట్టినా తట్టుకుంటాడు, కాళ్లమీద కొట్టినా నిలదొక్కుకుంటాడు కానీ అహం మీద కొడితే బాబు చంపేస్తాడు అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేస్తూ… రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నం అయిదంటూ పొలిటికల్ కామెంట్ చేస్తారు చూపించాడు. ఆ లా అండ్ ఆర్డర్ సమస్య కూడా బాబే సృష్టించాడని… వాళ్లకు వాళ్ల భాషలోనే సమాధానం చెప్పాలన్న ఉద్ధేశంతో కుట్రలు చేసి నడి రోడ్లపైనే హత్యలకు తెగబడ్డారనే అర్థం వచ్చేలా ట్రైలర్ రిలీజ్ చేశాడు.
ఇక మీకు వయస్సు అయిపోయింది… వచ్చే ఎన్నికల నాటికి 75 సంవత్సరాలు వచ్చేస్తాయి… కొడుకు పనికి రాడు, బుడ్డోడు పార్టీని లాగేసుకుంటాడు అంటూ బాబు అండ్ కో చర్చలు జరిపినట్లు చూపించాడు.
ఇక చివర్లో.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉండే షాట్‌తో ట్రైలర్‌ను ముగించాడు వర్మ.
ట్రైలర్‌తో ఏపీలో ఇదే జరుగుతోందని బాబును విలన్‌గా, సీఎంను హీరోగా చూపించాడు.