‘కుక్కల మేయర్’ అంటూ సొంత వాయిస్ తో ఆర్జీవీ సాంగ్ పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు ఈ సాంగ్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. హైదరాబాద్ వీధి కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉంది. దీంతో చాలా మంది హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిలో ఆర్జీవీ కూడా ఉన్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బాలుడిని నేను కరవమన్నానా? అని మండిపడ్డారు.
తాజాగా ఈ ఘటనపై రామ్ గోపాల్ వర్మ మరోసారి రియాక్ట్ అయ్యారు. మేయర్ పై పాట కూడా పాడారు. ‘కుక్కల మేయర్’ పేరుతో ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. తానే స్వయంగా లిరిక్స్ రాయడంతో పాటు.. సొంతంగా పాడారు కూడా.. ‘అడుక్కున్న పన్నులు అన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు.. మీ ఇంటిలోకి వందల కుక్కులు వదిలితే మీ పరిస్థితి.
అప్పుడు కానీ నొప్పి తెలియదు మీ కుక్క బ్రెయిన్ కు. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవదిరి మేయర్.. పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవరిది మేయర్.. ఆ తల్లిదండ్రుల గుండెలు వెక్కి వెక్కి ఏడుస్తుంటే కొద్దిగా అయిన బాధ ఉందా మీకు.. అంటూ సాంతం మేయర్ ను పాట రూపంలో కడిగిపారేశారు రామ్ గోపాల్ వర్మ.
ఈ పాటను తన ట్విట్టర్ ఆకౌంట్ ద్వారా విడుదల చేశారు ఆర్జీవీ. కొన్ని రోజులుగా నడుస్తున్న ట్విట్టర్ వార్ ఆర్జీవీ పాటతో పీక్ స్టేజ్ కు వెళ్లింది. మరి దీనిపై హైదరాబాద్ మేయర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Full song video of KUKKALA MAYOR music by @Anandkeys1 Sung by nandakishorenkm Lyrics by @RanjithKumarRi3 Dedicated to @GadwalvijayaTRS and her DOGS🙏🙏🙏 https://t.co/3V3eefzu6Z
— Ram Gopal Varma (@RGVzoomin) March 11, 2023