రాంగోపాల్ వర్మ… ఈ పేరును పెద్దగా టాలీవుడ్, బాలీవుడ్ లో ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్శీ చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ ఇటీవల కరోనా పై ఒక పాట పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ వీడియో ను పోస్ట్ చేశాడు వర్మ.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించటంతో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో ముంబై రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ముంబై రోడ్లు ఇలా నిర్మానుష్యంగా ఉండటం వర్మను ఆశ్చర్యానికి గురిచేసిందట…ముంబై ని ఇలా చూడటం కలో…లేక పీడకలో నిర్ణయించుకోలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.