సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనా మహమ్మారి ప్రేవేశించక ముందు కంటే ఇప్పుడే బిజీ గా ఉన్నాడని చెప్పాలి. లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించాడు. క్లైమాక్స్,నగ్నం, పవర్ స్టార్ చిత్రాలను ఓటిటి లో రిలీజ్ చేసి సందడి చేశాడు. అయితే ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఆయనతో కలిసిన వారికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై తనదైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.
నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను… తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పిన వర్మ… బహుశా ఈ వార్త అబద్ధం అయినందుకు వాళ్ళు చాలా బాధపడి ఉంటారని అన్నారు. నిజం ఏమిటంటే నేను చాలా ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నానని వర్మ కౌంటర్ ఇచ్చాడు. భవిష్యత్తులో వాళ్ళ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నానని వర్మ చెప్పుకొచ్చాడు.