కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే రాంగోపాల్ వర్మ అక్కడ ఉంటాడు. ఎప్పుడూ ఎదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే వర్మ ఈ సారి పవన్, పవన్ ఫాన్స్ ని గట్టిగా టార్గెట్ పెట్టుకున్నాడు. మొదటి నుంచి పవన్ పై ఏమాత్రం సందు దొరికినా ఎదో ఒక ఆరోపణ చేస్తుంటాడు. ఇప్పుడు దానికి తోడు పవన్ ఫాన్స్ వర్మ నే డైరెక్ట్ గా కెలికేశారు.
వర్మ చనిపోయాడంటూ కొన్ని చోట్ల బ్యానర్ లు కట్టారు పవన్ ఫాన్స్. మామూలుగానే వర్మ ఛాన్స్ ఇస్తే ఊరుకోడు, అలాంటిది కోరి మరీ కెలికితే వర్మ ఊరుకుంటాడా.. ఆ బ్యానర్ లను ఫోటోలు తీసి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ దెయ్యమై వచ్చి మీ హీరోని పెట్టుకుంటా అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు తాజాగా వర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ జీవితం ఆధారంగా సినిమా తీయాలని, అసలు ఎందుకు రాజకీయాల్లోకి పవన్ వచ్చారు, ఎలాంటి లబ్ధి పొందాలనుకుంటున్నారనే కథ తో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట వర్మ. గతంలో మట్టికుండలో మజ్జిగన్నం అనే టైటిల్ వైరల్ గా మారింది. అయితే వర్మకి ఆ టైటిల్ కి సంబంధం లేకపోయినా అలాంటి టైటిల్ నే పెట్టి ఓ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట వర్మ.