వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ ఏమి చేసిన అది సంచలనంగానే మారుతుంది. లాక్ డౌన్ మొదలు కావటంతో షూటింగ్ లు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతుంటే వర్మ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమాలను ఓటీటీ లో రిలీజ్ చేశాడు. క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ చిత్రాలను రిలీజ్ చేసిన వర్మ ఇప్పుడు త్రిల్లర్ సినిమాతో సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఆగష్టు 14 రాత్రి 8 గంటలకు ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. కాగా ఒక్కో వ్యూ కి 200 రూపాయలు చెల్లించాలని తెలిపాడు. ఈ మేరకు టికెట్ బుకింగ్స్ షురూ చేసి తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వెంటనే థ్రిల్లర్ టికెట్స్ బుక్ చేసుకోండి. 20 మంది లక్కీ విన్నర్స్ అప్సరా రాణితో పాటు ఆర్జీవీని కలిసే ఛాన్స్ కొట్టేయండి అంటూ ఓ పోస్టర్ పెట్టాడు. అయితే వర్మ గురించి తెలిసిన నెటిజన్లు వర్మ పోస్టర్ లు, మాటలు సినిమా ప్రమోషన్స్ కోసమే అంటూ కామెంట్ చేస్తున్నారు.