గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ నాగ బాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు వివాదాస్పద దర్శకుడు వర్మ. నాగ బాబు చెప్పింది నిజం. గాడ్సే నిజమైన భక్తుడంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అసలు గాంధీని ఆ సమయంలో ఎందుకు చంపాడో అప్పటి ప్రభుత్వం బయటకు రానివ్వలేదు. అందుకే గాడ్సే విలన్ అయ్యాడు. నిజానికి గాడ్సే గాంధీకి ఫాలోవర్. భారత్ కు స్వతంత్రం వచ్చింది. గాంధీని జాతిపిత అని చెప్పారు. అటువంటి సమయంలో గాంధీ హత్యకు గురయ్యాడు. అయితే ఇదే విషయమై అప్పటి ప్రభుత్వం ఎందుకు హత్య కబడ్డాడు అనే విషయాన్ని చెప్పలేదు. ఏదేమైనా నాగబాబు మాటలను నేను ఏకీభవిస్తున్నాను. త్వరలో గాడ్సే కథతో సినిమా కూడా చెయ్యబోతున్నాని వర్మ ప్రకటించారు.